ఆదివారం అగ్ని ప్రమాదానికి గురైన విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌ను అగ్నిమాపక శాఖ అధికారి, పోలీసులు పరిశీలించారు. విద్యుత్ శాఖ అధికారులు సైతం తనిఖీలు నిర్వహించారు. అగ్నిప్రమాదం జరిగిన సర్వర్ రూమ్‌ను అధికారులు పరిశీలించారు. సర్వర్ రూమ్ వద్ద ప్రమాదం సంభవించడానికి గల కారణాలను సేకరిస్తున్నారు. ప్రవేశమార్గానికి, రహదారికి మధ్య ఎంత దూరం ఉందన్న అంశంపైనా అధికారుల ఆరాతీశారు.
స్వర్ణ ప్యాలెస్ ప్రమాదస్థలిని పరిశీలించిన అధికారులు - విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద తాజా వార్తలు
విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌లో అగ్నిప్రమాదానికి సంబంధించిన కారణాలను అన్వేషించేందుకు అగ్నిమాపక, విద్యుత్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రమాదం జరిగిన సర్వర్ రూమ్‌ను పరిశీలించారు. స్వర్ణ ప్యాలెస్‌ను పూర్తిగా తనిఖీ చేసి, ప్రమాద కారణాలపై కలెక్టర్‌కు నివేదిక అందించనున్నారు. నిబంధనల ఉల్లంఘన జరిగిందా అనే కోణంలోనూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
స్వర్ణ ప్యాలెస్ ప్రమాదస్థలిని పరిశీలిస్తున్న అధికారులు
స్వర్ణ ప్యాలెస్ ను పూర్తిగా తనిఖీ చేసి, ప్రమాదానికి గల కారణాలను విద్యుత్, అగ్నిమాపకశాఖ అధికారులు కలెక్టర్‌కు నివేదించనున్నారు. నిబంధనల ఉల్లంఘన జరిగిందా అనే కోణంపై అధికారులు పరిశీలిస్తున్నారు. భవనానికి సంబంధించి కొలతలు తీసుకుంటున్నారు.
ఇదీ చదవండి : స్వర్ణ ప్యాలెస్ అంతర్గత లోపాలే ప్రమాదానికి కారణం?