విజయవాడ ఆటోనగర్‌లో అగ్నిప్రమాదం..3 లారీలు దగ్ధం - విజయవాడ ఆటోనగర్‌లో అగ్నిప్రమాదం వార్తలు
18:13 June 23
ఆటోనగర్‌లో అగ్నిప్రమాదం
Fire Accident in Vijayawada: విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పోలీసు స్టేషన్రోడ్డులోని ఆంజనేయస్వామి ఆలయం పక్కన లారీ బాడీ బిల్డింగ్ చేసే షెడ్డులో అగ్నిప్రమాదం జరిగింది. లారీకి వెల్డింగ్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో పక్కనున్న మరో రెండు లారీలకు మంటలు వ్యాపించాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో మూడు లారీలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
ఇవీ చూడండి