విజయవాడ ఏలూరు రోడ్డులోని గృహోపకరణాల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పక్కనే ఉన్న హోమియోపతి ఆసుపత్రికి కూడా మంటలు వ్యాపించాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. భారీగా ఆస్థి నష్టం సంభవించింది. గృహోపకరణాలు కాలి బూడిదయ్యాయి. హోమియోపతి ఆసుపత్రిలోని రసాయన సీసాలు పేలినందున ప్రజలు భయంతో పరుగులు తీశారు.
ఏలూరు రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం - ఏలూరు రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం
విజయవాడ ఏలూరు రోడ్డులోని గృహోపకరణాల దుకాణంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించిందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.

ఏలూరు రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం