విజయవాడ గుణదలలోని విద్యుత్ ఉపకేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించి.. మంటలను అదుపులోకి తేవటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆరుబయట పడేసిన ప్లాస్టిక్ బాక్సులు, ఇతర వస్తువులు కాలిపోయి.. పాత ట్రాన్స్పార్మర్కు మంటలు అంటుకున్నాయి. దట్టమైన పొగ చుట్టుపక్కలకు వ్యాపించాయి.
పెరిగిన ఉష్ణోగ్రతలు
మూడు రోజులుగా విజయవాడలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆరుబయట ఉన్న ఎండుగడ్డి కాలి మంటలు చెలరేగి ప్లాస్టిక్‌బాక్సుల వరకు చేరాయి. దీంతో ఒక్కసారిగా అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.