'ఆ ప్రకటనలు అన్ని రంగాలకు భరోసా ఇస్తాయి' - రిజర్వు బ్యాంకు వార్తలు
రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత్‌దాస్ ప్రకటన దేశంలోని అన్ని రంగాలకు భరోసా ఇస్తుందని... ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు అనంత్ అభిప్రాయపడ్డారు. ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యంతో అవస్థలు పడుతున్న తరుణంలో... కరోనా వైరస్ వ్యాప్తి తీవ్ర ప్రతికూలతను సృష్టించిందన్నారు. ఇతర దేశాల కంటే కరోనా వైరస్ వ్యాప్తి మన దేశంలో కొంత తక్కువగా ఉన్నప్పటికీ... ఆర్థికంగా ఈ పరిస్థితులు పెను సవాళ్లను సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచేలా రిజర్వు బ్యాంకు కీలక ప్రకటనలు చేసిందని 'ఈటీవీభారత్' ముఖాముఖిలో అభిప్రాయపడ్డారు.
ఆర్థిక రంగ నిపుణులు అనంత్‌తో ముఖాముఖి