తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కొండపాక వద్ద ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్(HARISH) రావు కాన్వాయ్‌కి ప్రమాదం జరిగింది. అడవి పందుల గుంపు అడ్డు రావడంతో.. వాటిని తప్పించబోయి పైలట్ వాహనం డ్రైవర్ సడన్ బ్రేక్ వేశారు. ఫలితంగా కాన్వాయ్‌లోని వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి. ఘటనా స్థలి నుంచి మరో వాహనంలో హరీశ్ రావు హైదరాబాద్‌కు వెళ్లారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే.. హరీశ్‌రావుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేశారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. తను క్షేమంగానే ఉన్నట్లు హరీశ్ రావు తెలిపారు.
harishrao: తెలంగాణ మంత్రి హరీశ్ రావు... కాన్వాయ్‌కి ప్రమాదం - హరీశ్ రావు వార్తలు
తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ (HARISH) రావు కాన్వాయ్‌కి ప్రమాదం జరిగింది. సిద్దిపేట నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
మంత్రి హరీశ్ రావు
సిద్దిపేట నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న క్రమంలో కొండపాక వద్ద నా కారుకు ప్రమాదం జరిగింది. నేను క్షేమంగానే ఉన్నా. నా డ్రైవర్, గన్‌మెన్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వారు కూడా క్షేమంగానే ఉన్నారు. దయచేసి శ్రేయేభిలాషులు, మిత్రులు ఆందోళన చెందొద్దని కోరుతున్నా. -హరీశ్ రావు, ఆర్థిక శాఖ మంత్రి
ఇదీ చదవండి:ACCIDENT: ఆగి ఉన్న లారీని ఢీకొన్న డీసీఎం..50 మందికి గాయాలు