Film Exhibitors: సినిమా విడుదలైన రెండు వారాల తరువాతే ఓటీటీకి ఇవ్వాలని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఓటీటీ, టిక్కెట్ ధరలపై సినిమా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు విజయవాడలో సమావేశం నిర్వహించారు. పెద్ద బడ్జెట్ సినిమాలకు పది వారాలు, చిన్న బడ్జెట్ సినిమాలకు రెండు వారాల వరకు ఓటీటీకి ఇవ్వరాదని సమావేశంలో నిర్ణయించారు.
'సినిమా విడుదలైన రెండు వారాల తరువాతే ఓటీటీకి ఇవ్వాలి'
OTT: సినిమా విడుదలైన రెండు వారాల తరువాతే ఓటీటీకి ఇవ్వాలని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఓటీటీ వల్ల థియేటర్లలో కొత్త సినిమాలకు తొలి రోజే ప్రేక్షకులు ఉండటం లేదని వారు వాపోతున్నారు. సినిమా టిక్కెట్ రేట్లు ఇప్పుడున్న విధంగా యథావిధిగా కొనసాగించాలని కోరుతున్నారు.
డీపీఎఫ్ ఛార్జీలపై పూర్వ పరిస్థితి కొనసాగించాలని విజయవాడ ఎగ్జిబిటర్ల సంఘం అధ్యక్షులు సాయి ప్రసాద్ డిమాండ్ చేశారు. టిక్కెట్ ధరల విషయంలో సీ క్లాస్ సెంటర్లో ఇబ్బందులను సినీ పెద్దలకు వివరిస్తామన్నారు. ఓటీటీ వల్ల థియేటర్లలో కొత్త సినిమాలకు తొలి రోజే ప్రేక్షకులు ఉండటం లేదని తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యదర్శి రమేశ్ అన్నారు. డీపీఎఫ్ ఛార్జీలు నిర్మాతలే చెల్లించాలని సమావేశంలో తీర్మానించామన్నారు. సినిమా టిక్కెట్ రేట్లు ఇప్పుడున్న విధంగా యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి