నిన్న మధ్యాహ్నం ఒంటి గంటవరకూ 11 వేల 839 మంది దాతలు... 133 కోట్ల 6 లక్షల 65 వేల 477 రూపాయల విరాళాలు అందించారు. నరసరావుపేట నియోజకవర్గ ప్రజలు, వైద్యులు, వ్యాపారవేత్తల తరఫున కోటి 18 వేల 227 రూపాయల విరాళాన్ని... ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి... ముఖ్యమంత్రికి అందించారు. వరుణ్‌గ్రూప్ ఛైర్మన్ ప్రభు కిషోర్, ఎండీ వరుణ్‌దేవ్... 2 కోట్ల రూపాయల చెక్ అందించారు. విజయవాడ రోమన్ కేథలిక్ డయోసిస్ 25 లక్షల రూపాయల విరాళమిచ్చింది. సువెన్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ సీఈఓ వెంకట్ జాస్తి కోటి రూపాయల చెక్‌ను ముఖ్యమంత్రికి అందించారు. దొడ్ల డెయిరీ 25 లక్షలు విరాళమిచ్చింది.
కరోనాపై పోరులో ఆర్థిక సాయం ద్వారా భాగస్వాములు కావాలసిన వారు ముఖ్యమంత్రి సహాయనిధి ఆంధ్రప్రదేశ్ పేరున తమ చెక్కులను పంపాలని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా విరాళాలు అందజేయాలనుకునేవారు ఎస్బీఐ ఖాతా నెం : 38588079208, ఐఎఫ్ఎస్సీ కోడ్ - SBIN0018884, సెక్రటేరియట్ బ్రాంచ్, వెలగపూడి, ఆంధ్రా బ్యాంక్ ఖాతా నెం : 110310100029039, ఐఎఫ్ఎస్సీ కోడ్- ANDB003079, సెక్రటేరియట్ బ్రాంచ్, వెలగపూడి ఖాతాలలో జమచేయాలన్నారు.