Cruel Father:. అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన కుమారుడి పట్ల ఓ తండ్రి కర్కశంగా వ్యవహరించాడు. కంటికి రెప్పలా కాపాడుకుంటూ ప్రయోజకుల్ని చేయాల్సిన తండ్రే మద్యానికి బానిసై కుమారుడిని చిత్రహింసలకు గురి చేశాడు. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ గ్రామంలో ఈ అమానవీయ ఘటన జరిగింది.
మద్యానికి డబ్బులివ్వలేదని.. కుమారుడిపై వేడి నూనె పోసిన తండ్రి
Cruel Father: పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ప్రయోజకుల్ని చేయాల్సిన తండ్రే మద్యానికి బానిసై కుమారుడిని చిత్రహింసలకు గురి చేశాడు. కన్నతండ్రే బాలుడి పట్ల కర్కశంగా వ్యవహరించిన ఈ ఘటన మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాసిపేట మండలం దేవాపూర్ గ్రామానికి చెందిన అబ్బూ(13) తల్లిదండ్రులు మద్యానికి బానిసై ఇంట్లోనే ఉంటున్నారు. కుటుంబ పోషణ కోసం నాలుగేళ్లుగా ఆ బాలుడే గ్రామంలో భిక్షాటన చేసి వచ్చిన దాంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. రెండు రోజుల క్రితం డబ్బులు తీసుకురాలేదు. దీంతో మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తండ్రి ఎండీ ఇస్మాయిల్ కుమారుడిని ఇంట్లోనే బంధించాడు. ఆదివారం వేడి నూనెను బాలుడి చేతులపై పోయడంతో నొప్పి భరించలేక కేకలు పెట్టాడు. గమనించిన స్థానికులు బాలుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి: