కుమార్తె వరసయ్యే బాలిక(15)పై అత్యాచారం చేసిన కేసులో ఓ నిందితుడికి ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష,రూ.500జరిమానా విధిస్తూ విజయవాడ మహిళా సెషన్స్ న్యాయస్థానం న్యాయమూర్తి జి.ప్రతిభాదేవి తీర్పు చెప్పారు.విజయవాడ ఇబ్రహీంపట్నానికి చెందిన సైకం కృష్ణారావు(54)గతంలో ఉయ్యూరు చక్కెర పరిశ్రమలో పని చేస్తుండేవాడు.భర్తతో విడిపోయి ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్న ఓ మహిళతో సాన్నిహిత్యం ఏర్పరచుకున్నాడు.దేవుని ఫొటో ముందు ఆమె మెడలో తాళికట్టాడు.ఇద్దరూ భార్యభర్తలుగా ఇబ్రహీంపట్నంలో జీవనం సాగిస్తున్నారు.మహిళకు ఉన్న పిల్లల్లో పదో తరగతి చదువుతున్న బాలికపై2018జనవరి27న కృష్ణారావు అత్యాచారం చేశాడు.బాధితురాలు ఈ విషయాన్ని తల్లికి చెప్పగా..నిందితుడు వారిద్దర్నీ బెదిరించి పారిపోయాడు.బాలిక తల్లి ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. తర్వాత అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు కేసు విచారణ చేసిన న్యాయస్థానం.. 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
'కూతురు'పై అత్యాచారం.. 20ఏళ్ల జైలు శిక్ష - బాలికపై అత్యాచారం కేసులో 20 ఏళ్లు జైలు శిక్ష
వరుసకు కూతురు అన్న ఇంగిత జ్ఞానాన్ని మరిచి.. అత్యాచారం చేసిన దుర్మార్గుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది విజయవాడ మహిళా సెషన్స్ న్యాయస్థానం. గత ఏడాది జరిగిన ఘటనపై బాధితురాలని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. ఇప్పుడు కోర్టు శిక్షను విధించింది.
father-jail-in-raped-daughter-case
TAGGED:
taza