ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ.. లిఫ్ట్​లో చిక్కుకున్న తండ్రి, కుమార్తె - మణికొండ లాన్​కో హిల్స్

అసలే హైదరాబాద్​ మహా నగరం.. ఇక్కడ నివసించే చాలా మందికి తమ ఇంటి పక్కన ఎవరు ఉంటారు, ఏం చేస్తారనే విషయమే తెలియదు. ఇక గేటెడ్ కమ్యూనిటీల్లో పరిస్థితి మరోలా ఉంటుంది. మాట పలకరింపులూ తక్కువగానే ఉంటాయి. ఏదో కమ్యూనిటీ మీటింగ్ అయితే తప్ప ఒకరినొకరు కలుసుకునే దాఖలాలు తక్కువనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితిలో ల్యాంకో హిల్స్​ లిఫ్ట్​లో తండ్రి, కుమార్తె 40 నిమిషాల పాటు భయాందోళనతో యాతన అనుభవించారు.

father-and-daughter-struck-in-lift-in-lanco-hills-manikonda-rangareddy-district
father-and-daughter-struck-in-lift-in-lanco-hills-manikonda-rangareddy-district

By

Published : May 10, 2020, 5:44 PM IST

ల్యాంకో హిల్స్​ లిఫ్ట్​లో చిక్కుకున్న తండ్రి, కుమార్తె

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మణికొండ ల్యాంకో హిల్స్ అదే అపార్టుమెంట్​లో నివసించే శ్రీనివాస్ రెడ్డి తన ఆరు సంవత్సరాల కూతురితో కలిసి లిఫ్ట్​ ఎక్కాడు. 34వ అంతస్తుకు చేరుకున్నాక లిఫ్ట్ ఆగిపోయింది. తలుపులు తెరుచుకోలేదు. ఆందోళన చెందిన శ్రీనివాస్​ రెడ్డి ఫోన్ కాల్స్ చేసినా అపార్ట్​మెంట్ వాసులెవరూ స్పందించలేదు.

సుమారు 40 నిమిషాల పాటు లిఫ్ట్​లో ఇరుక్కుపోయి వేదన అనుభవించారు. చివరికి తానే స్వయంగా లిఫ్ట్ తలుపుల్ని తొలగించి కూతురుతో సహా బయటపడ్డారు. లాక్​డౌన్ నేపథ్యంలో ఎక్కడివాళ్లు అక్కడే ఉండటం వల్ల తండ్రి, కూతురు ఫోన్​కు ఎవరూ స్పందించలేదు. విపత్కరమైన దుస్థితిని శ్రీనివాస్​ రెడ్డి విజయవంతంగా ఎదుర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details