విజయవాడ కొండపల్లి ఖిల్లా వద్ద 'సమానా' ఫ్యాషన్ విద్యార్ధినులు ఫ్యాషన్ షో ప్రదర్శించారు. సొంతంగా డిజైన్ చేసిన దుస్తులను ప్రదర్శిస్తూ క్యాట్ వాక్ నిర్వహించారు. పదేళ్లలో 5 వేల మంది విద్యార్థులు ఫ్యాషన్ డిజైన్ కోర్సులు పూర్తి చేశారని సంస్థ ఎండీ సమాన తెలిపారు. ఎన్నో రంగాలకు ఆర్ధికంగా చేయూతనిస్తున్న ప్రభుత్వం... డిజైన్ రంగాన్ని గుర్తించాలని కోరారు. పరిశ్రమల ఏర్పాటు, రుణాలు అందిస్తే..ఫ్యాషన్ రంగంలో ఎంతో మంది మహిళలకు, యువతకు ఉపాధి దొరుకుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. సరికొత్త ఆలోచనలతో డిజైన్ చేసే దుస్తుల వల్ల రాష్ట్రానికి కూడా మంచి పేరొస్తుందన్నారు.
కొండపల్లి ఖిల్లాలో ఫ్యాషన్ షో - kondapally vijayawada
విజయవాడ కొండపల్లి ఖిల్లా వద్ద 'సమానా' ఫ్యాషన్ విద్యార్ధినులు ఫ్యాషన్ షో ప్రదర్శించారు. సొంతంగా డిజైన్ చేసిన దుస్తులను ప్రదర్శిస్తూ క్యాట్ వాక్ నిర్వహించారు.
ఫ్యాషన్ విద్యార్ధినులు ఫ్యాషన్ షో