కృష్ణా జిల్లా అవనిగడ్డ శివారు కొత్తపేట గ్రామానికి చెందిన ముళ్లపూడి వెంకట కృష్ణ అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాలుగు ఎకరాలు వ్యవసాయం చేస్తూ కొంత పొలం కౌలు చేస్తన్నాడు. తుపాను ధాటికి పంట మొత్తం దెబ్బతినడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు తెలిపారు. వెంకటకృష్ణ పురుగుల మందు తాగినట్లు తెలుసుకున్న బంధువులు అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మృతి చెందాడు.
పంట నష్టపోవటంతో రైతు ఆత్మహత్య - farmer suicide latest news
కృష్ణా జిల్లా అవనిగడ్డలో విషాదం జరిగింది. తుపాను కారణంగా పంటలు దెబ్బతినటంతో... ముళ్లపూడి వెంకటకృష్ణ అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుని బంధువులు తెలిపారు.
పంట నష్టాపోవటంతో రైతు ఆత్మహత్య