ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

లా అండ్ ఆర్డర్ కాపాడాలంటే.. పది మందిని కాల్చి చంపాల్సి వచ్చేది : కొడాలి నాని - పవన్​పై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్​

Farmer Minister kodali nani fires on pawan kalyan: నిక్కర్లు వేసుకునే పిల్లల్ని రెచ్చగొట్టి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పబ్బం గడుపుకుంటున్నారని మాజీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. అంబేడ్కర్‌ను వ్యతిరేకించే వాళ్లను దేశ బహిష్కరణ చేసి జైలుకు పంపాలని వ్యాఖ్యానించారు.

kodali nani fires on pawan kalyan
మాజీ మంత్రి కొడాలి నాని

By

Published : May 26, 2022, 6:43 PM IST

'నిక్కర్లు వేసుకునే పిల్లలను రెచ్చగొట్టి పవన్ కల్యాణ్ పబ్బం గడుపుతున్నారు'

kodali nani Comments on pawan kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్​పై మాజీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిక్కర్లు వేసుకునే పిల్లలను రెచ్చగొట్టి పవన్ కల్యాణ్ పబ్బం గడుపుతున్నారని అన్నారు. 'ఎవరో రాసిన స్క్రిప్టులు చదువుతూ.. రాజ్యాంగంపై అవగాహన లేని సన్నాసులు రాజకీయాల్లోకి వస్తే ఇలాగే జరుగుతుంది. అంబేడ్కర్​ను వ్యతిరేకించే వాళ్లకు దేశ బహిష్కరణ విధించి జైలుకు పంపాలి. ప్రభుత్వానికి ప్రజల క్షేమమే ముఖ్యం. మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లు కాదు. ఒకవేళ.. ప్రభుత్వం ఫైర్ ఓపెన్ చేయించి కాల్పులు జరిపితే పరిస్థితి అదుపులోనే ఉండేది. కానీ.. తర్వాత చంద్రబాబు, అసలు పుత్రుడు, దత్త పుత్రుడు వచ్చి చనిపోయినవారి పాడెలు మోస్తూ శవ రాజకీయాలు చేసేవారు' అని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details