రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం ఘటనలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలపై ఆంక్షలు పెట్టడం హేయమైన చర్య అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందన్నారు. కృష్ణా జిల్లా మైలవరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవాలయాల రక్షణను ప్రభుత్వం గాలికి వొదిలేసిందన్నారు. రూ. లక్షల కోట్లు దేవాలయాలకి రాసి ఇచ్చిన అశోక్ గజపతి రాజును ఉద్దేశించి నోటికొచ్చిన మాట్లాడటం తగదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
'దేవాలయాలకు రక్షణ కల్పించడంలో జగన్ ప్రభుత్వం విఫలం' - devineni uma latest news on cm jagan
దేవాలయాలపై దాడులను అరికట్టడంలో వైకాపా ప్రభుత్వం దారుణంగా విఫలమైందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. మైలవరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
దేవాలయాలకు రక్షణ కల్పించడంలో జగన్ ప్రభుత్వం విఫలం