కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా(central minister ajay mishra)ను మంత్రివర్గం(cabinet) నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ... సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో విజయవాడలో రైతు సంఘాల నాయకులు ఆందోళన చేశారు.(farmer leaders protest in vijayawada) దేశవ్యాప్తంగా చేపట్టిన రైల్ రోకో(rail roco) కార్యక్రమంలో భాగంగా విజయవాడ రైల్వేస్టేషన్ వద్ద రైతు సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు(vadde shobhanadrishwara rao) ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. రైతులపై వాహనం నడిపి, వారి మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్(demand) చేశారు. రైతు,కార్మిక చట్టాలను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని నినాదాలు చేశారు.
కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు ప్రకాశం జిల్లా ఒంగోలు రైల్వేస్టేషన్(ongol railway station) ఎదుట ఆందోళన చేపట్టారు. లఖింపూర్ ఖేరీలో రైతుల మరణాలకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ... గుంటూరు జిల్లా వినుకొండ(vinukonda) రైల్వే స్టేషన్ ఎదుట బైఠాయించారు.
లఖింపూర్ ఖేరీలో రైతులపై వాహనం నడిపించి, నలుగురు రైతుల మరణానికి కారకులయ్యారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి స్పందించలేదు. కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పలేదు. దీనిని చూస్తుంటే ఇదంతా కుట్రపూరితంగా జరిగినట్లు తెలుస్తోంది. హింసాత్మకంగా కాకుండా.. శాంతియుత పద్ధతిలో నిరసన చేస్తూ లక్ష్యాన్ని చేరుకుంటాం - వడ్డే శోభనాద్రీశ్వరరావు, రైతు సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు