కేంద్ర ప్రభుత్వం తన మొండి వైఖరిని మార్చుకోకుంటే ఉద్యమం తప్పదని రైతుసంఘాల నేతలు హెచ్చరించారు. అఖిల భారత కిసాన్ సంఘాల సమాఖ్య పిలుపు మేరకు.. పోలవరం నిర్వాసితులు, విద్యుత్ చట్టం-2020, విశాఖ ఉక్కు పరిరక్షణ కోరుతూ.. దిల్లీ వేదికగా తమ గళం వినిపించేందుకు మాజీమంత్రి వడ్డే శోభనాదీశ్వరరావు నేతృత్వంలో ఐకాసా ప్రతినిధుల బృందం దిల్లీకి పయనమైంది.
తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు ఉద్యమం ఆగదన్నారు. దిల్లీ వెళ్లిన బృందంలో.. వామపక్ష నేతలు పి.మధు, కొల్లా రాజమోహన్, ముప్పాళ్ల నాగేశ్వరరావు, రమాదేవి, అనిత, రైతు సంఘ నేత ఆళ్ల గోపాలకృష్ణ, వి.శ్రీనివాసరావు, ఉమా వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.