ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గవర్నర్ నరసింహన్​కు రేపు వీడ్కోలు - jagan

రాష్ట్రానికి నూతన గవర్నర్​గా బిశ్వభూషణ్ హరిచందన్ నియమితులైనందున గవర్నర్ నరసింహన్​కు రేపు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించనున్నారు.

గవర్నర్

By

Published : Jul 21, 2019, 10:35 PM IST

గవర్నర్ నరసింహన్‌కు రేపు విజయవాడలో వీడ్కోలు కార్యక్రమం జరగనుంది. రేపు సాయంత్రం 7 గంటలకు నగరంలోని గేట్‌వే హోటల్‌లో దీనిని నిర్వహించనున్నారు. సీఎం జగన్, మంత్రులు, ఉన్నతాధికారులు కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రానికి నరసింహన్ విజయవాడకు చేరుకోనున్నారు. అలాగే సీఎం జగన్​తో పాటు కీలక నేతలకు ఆయన విందు ఇవ్వనున్నారు. మరో వైపు నూతన గవర్నర్ బీబీ హరిచందన్ ఎల్లుండి రాష్ట్రానికి రానున్నారు. ఈనెల 24న విజయవాడ రాజ్‌భవన్‌లో ఆయన ప్రమాణం స్వీకారం చేయనున్నారు. హరిచందన్​కు భద్రత, పర్యవేక్షణ సహాయాధికారిగా మాధవరెడ్డి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details