ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

FAPTO: ఈనెల 23న సీపీఎస్ రద్దు కోసం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు..

వైకాపా అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తైనప్పటికీ ఒక్క సమస్య పరిష్కారానికి నోచుకోలేదని ఆంధ్రప్రదేశ్​ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(FAPTO) ఛైర్మన్ సుధీర్​బాబు మండిపడ్డారు. పీఆర్సీ, డీఏల సాధన, సీపీఎస్ రద్దు కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాత మండల కేంద్రాల్లో జులై 23న ఫ్యాప్టో(FAPTO) ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.

fapto protest against the cps
ఆంధ్రప్రదేశ్​ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య

By

Published : Jul 20, 2021, 9:57 PM IST

పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు, పాత పింఛను పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్​ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(FAPTO) ఛైర్మన్ సుధీర్ బాబు డిమాండ్ చేశారు. కాలయాపన కోసం గతంలో వేసిన కమిటీలను రద్దు చేసి పాత పింఛను అమలుకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. పీఆర్సీ, డీఏల సాధన, సీపీఎస్ రద్దు కోరుతూ... రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో జులై 23న ఫ్యాప్టో(FAPTO) ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టనున్నట్లు తెలిపారు. హక్కుల సాధన కోసం దశల వారి పోరాటంలో భాగంగా పాత తాలుకా కేంద్రాలలో ధర్నాలకు పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు.

వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తైనప్పటికీ నేటికీ ఒక్క సమస్య పరిష్కారానికి నోచుకోలేదని మండిపడ్డారు. పీఆర్సీ నివేదికను కమిషన్ సమర్పించినప్పటికీ బహిర్గతం చేయకుండా కాలయాపన చేస్తున్నారని పేర్కొన్నారు. పెండింగ్​లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖలో 2019 నుంచి నేటివరకు పదోన్నతులు కల్పించలేదని.. వెంటనే పదోన్నతుల షెడ్యూలు ఇవ్వాలన్నారు. నూతన విద్యా విధానంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.

కొవిడ్​తో మరణించిన వారి కుటుంబాలకు కారుణ్య నియామకాలతో గ్రీన్ ఛానల్ ద్వారా అన్ని శాఖల్లో నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మరణించిన, పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు అందాల్సిన ప్రయోజనాలను జాప్యం లేకుండా వెంటనే మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు

ఇదీ చదవండి..

ap corona cases: కొత్తగా 2,498 కరోనా కేసులు, 24 మరణాలు

ABOUT THE AUTHOR

...view details