ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కరోనా దెబ్బకు చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కుదేలు' - 'కరోనా దెబ్బకు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కుదేలు'

కరోనా మహమ్మారి కారణంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు పూర్తిగా దెబ్బతిన్నాయని... చిన్న, మధ్యతరహా పరిశ్రమల సమాఖ్య అధ్యక్షులు వాసిరెడ్డి మురళి కృష్ణ వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమల ఉత్పత్తికి సహకరించి ఆదుకోవాలన్నారు.

By

Published : May 1, 2020, 5:01 PM IST

కరోనా వల్ల చిన్న, మధ్యతరహా పరిశ్రమలు పూర్తిగా కుదేలయ్యాయని... చిన్న, మధ్యతరహా పరిశ్రమల సమాఖ్య అధ్యక్షులు వాసిరెడ్డి మురళి కృష్ణ అన్నారు. ఈ పరిశ్రమల ద్వారా 11 కోట్ల మందికి దేశంలో ఉపాధి లభిస్తుందన్న మురళి... కరోనా ప్రభావంతో వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామిక రంగం కూడా దెబ్బతిన్నదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం... పరిశ్రమల్లో ఉత్పత్తి, ఉపాధి కోసం చర్యలు తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. పరిశ్రమ వర్గాలకు ఊతం ఇచ్చేలా ప్రోత్సాహకాలు, రుణాలు ఇప్పించడం ద్వారా న్యాయం చేసేలా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details