Family suicide attempt: విజయవాడ ఆర్టీసీ బస్టాండు అవుట్‌గేట్ సమీపంలోని ఓ లాడ్జిలో.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. విషయం తెలిసిన వెంటనే కృష్ణలంక పోలీసులు వారితో ఉప్పునీరు తాగించి ప్రాణాంతక విషాన్ని బయటకు కక్కించారు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో.. నలుగురు ప్రస్తుతానికి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అప్పుల బాధలు తాళలేక.. కుటుంబం ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు చెబుతున్నారు.
Family suicide attempt: విజయవాడలో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. అప్పులే కారణమా..! - విజయవాడలో కుటుంబం ఆత్మహత్యాయత్నం

07:27 April 25
ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని లాడ్జిలో పురుగుల మందు తాగిన కుటుంబం
మచిలీపట్నానికి చెందిన జూపూడి వెంకటేశ్వరరావు కుటుంబం.. ఆర్ధిక ఇబ్బందులు, వేదింపులు ఎదుర్కొంటోంది. గతనెల ఎనిమిదో తేదీ నుంచి కుటుంబం మొత్తం లాడ్జిలోనే ఉంటున్నట్లు తెలిసింది. ఆత్మహత్యకు ముందు తమ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఫోన్ ద్వారా సంక్షిప్త సందేశం పంపించినట్లు పోలీసులు గుర్తించారు. ట్రైసిల్ పౌడరు అనే పురుగుల మందును వెంకటేశ్వరావుతో పాటు అతని భార్య రాధారాణి, కుమార్తెలు భావన, శ్రావణి తాగి అస్వస్థతకు గురయ్యారు. పోలీసులు, వైద్యులు సకాలంలో స్పందించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఘటనపై కృష్ణలంక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: