కరోనాపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే... - corona latest news
సామాజిక మాధ్యమాలను కేంద్రంగా చేసుకుని కొంతమంది తప్పుడు ప్రచారాలను చేస్తున్నారు. పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. ఈ పోస్టుల్లో ఏది నిజమో.. ఏది అబద్దమో తెలియక ప్రజలు ఆందోళకు గురవుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలంతా ఇళ్లకు పరిమితమయ్యారు. అయితే కొంతమంది తమ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లలో నిమగ్నమై... తప్పుడు పోస్టులు పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతుండగా... ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. దీన్ని కట్టడి చేసేందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారో సైబర్ క్రైం ఇన్స్పెక్టర్ శివాజీని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
ఈటీవీ భారత్తో సైబర్ క్రైం ఇన్స్పెక్టర్ శివాజీ