ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రవాణాశాఖలో నకిలీ ఉద్యోగాల పేరుతో మోసం

రవాణాశాఖలో నకిలీ ఉద్యోగ నియామకాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సీఎస్ పేరిట ఫోర్జరీ సంతకాలతో ఎంవీఐ ఉద్యోగాల నియామక పత్రాలు జారీ చేసి..పోస్టుకు రూ.2 లక్షల చొప్పున బేరం కుదుర్చుకున్నాడో నిందితుడు. వివరాల్లోకి వెళితే..

Fake Transport department jobs Fraud
రవాణాశాఖలో నకిలీ ఉద్యోగాల పేరుతో మోసం

By

Published : Jan 29, 2021, 4:08 AM IST

రవాణా శాఖలో నకిలీ ఉద్యోగ నియామకాల వ్యవహారం కలకలం రేపింది. సీఎస్ పేరిట నకిలీ సంతకాలతో మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల నియామక పత్రాలు జారీ అయ్యాయి. ఒక్కో ఎంవీఐ పోస్టుకు 2లక్షల చొప్పున బేరం కుదుర్చుకున్న వ్యక్తి నకిలీ ఉద్యోగ నియామక పత్రాలు జారీ చేశాడు. తాను ఐఎఎస్ అధికారి అని చెప్పి అపాయింట్ మెంట్ ఆర్డర్లు జారీ చేసిన సురేంద్రకుమార్ అనే వ్యక్తి ఒప్పందం ప్రకారం ముందస్తుగా కొంత డబ్బు వసూలు చేసి నియామక పత్రాలు జారీ చేసినట్లు బాధితులు తెలిపారు.

విజయవాడకు చెందిన మహ్మద్ షఫియుద్దీన్ అనే వ్యక్తి నియామక పత్రాలు తీసుకుని ఉద్యోగం ఇవ్వాలని రవాణాశాఖ కమిషనర్ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడి అధికారులను కలిసి ఉద్యోగంలో చేర్చుకోవాలని కోరటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నకిలీ నియామకాలపై రవాణాశాఖ ఉన్నతాధికారులు కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డబ్బు వసూలు చేసి 10 మందికి ఎంవీఐ ఉద్యోగ నకిలీ నియామక పత్రాలు జారీ చేసినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. బాధితులు ఇచ్చిన వివరాల మేరకు పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details