తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి పరిసరాల్లో ఇటీవల కలకలం రేపిన కల్తీ పొటాష్ వ్యవహారంపై టీఎస్ ప్రభుత్వం దర్యాప్తు చేపట్టింది. ఇసుక రంగుమార్చి పొటాష్‌గా విక్రయిస్తున్నట్లు గుర్తించిన అధికారులు.. రైతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఇవాళ ఏపీకి వచ్చిన తెలంగాణ పోలీసు, వ్యవసాయశాఖ అధికారులు విచారణ చేపట్టారు. విజయవాడ శివారు నున్నలోని హేమ బయోటెక్, ఇతర ఆగ్రో పరిశ్రమలను పరిశీలించారు. పరిశ్రమ నిర్వాహకుల నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
తెలంగాణలో నకిలీ ఎరువులు.. ఏపీలో దర్యాప్తు!
తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి పరిసరాల్లో కలకలం రేపిన నకిలీ ఎరువుల కుంభకోణంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు ముమ్మరం చేసింది. దర్యాప్తులో భాగంగా ఇవాళ ఏపీకి వచ్చిన తెలంగాణ అధికారులు విజయవాడ శివారు ప్రాంతాల్లో విచారణ చేపట్టారు.
తెలంగాణలో నకిలీ ఎరువులు