రాష్ట్రంలో 17 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవకతవకలు జరిగినట్లు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ శేషగిరిబాబు వెల్లడించారు. నకిలీ చలానాల అక్రమాలు జరిగినట్లు గుర్తించామన్నారు. 10 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఎక్కువగా అవకతవకలు జరిగాయన్న ఐజీ... ఇప్పటివరకు రూ.5.25 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించామన్నారు. వీటిలో ఇప్పటి వరకు రూ.కోటి రికవరీ చేసినట్లు వివరించారు. మిగతా మొత్తాన్ని రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగిన అవకతవకలపై ఆరుగురు సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేశాం. మిగతా సబ్‌రిజిస్ట్రార్లపై అంతర్గత విచారణ జరుగుతోంది. అవకతవకలు జరిగిన చోట్ల కేసులు నమోదు చేయిస్తున్నాం. రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను పూర్తిగా మార్చివేశాం. ప్రస్తుతం సీఎఫ్ఎంఎస్ సాఫ్ట్‌వేర్‌ను రిజిస్ట్రేషన్లకు వినియోగిస్తున్నాం.