ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కిటికీలు పగలగొట్టి దూకేశాను: ప్రత్యక్ష సాక్షి - Eyewitness in the vijayawada fire accident latest news

"ప్రమాదం సమయంలో ఏం జరిగిందో అర్థం కాలేదు. కిటికీలు పగలగొట్టి బయటికి దూకి ప్రాణాలు కాపాడుకున్నా" అంటూ విజయవాడలో అగ్నిప్రమాద బాధితుడు ఒకరు.. సామాజిక మాధ్యమాల్లో వీడియో విడుదల చేశారు.

Eyewitness in the vijayawada fire accident is share a video
ప్రత్యక్ష సాక్షి

By

Published : Aug 9, 2020, 6:01 PM IST

ప్రత్యక్ష సాక్షి

విజయవాడలో జరిగిన అగ్నిప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ప్రత్యక్ష సాక్షి, బాధితుడు.. ఓ విడియో విడుదల చేశారు. పవన్ సాయి కిషన్ అనే వ్యక్తి... రమేష్ ఆస్పత్రి ఏర్పాటు చేసిన కొవిడ్ సెంటర్ (స్వర్ణ ప్యాలెస్)లో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో అసలు ఏం చేయాలో అర్థం కాలేందని, ఎటు వెళ్లాలో తెలియక అయోమయానికి గురయ్యానని చెప్పారు. ఏం చేయాలో తెలియక గది కిటికీలు పగలగొట్టి దూకానని వివరించారు.

ప్రహరి గోడపై ఉండి కాపాడండి... కాపాడండి.. అంటూ కేకలు వేసినట్టు చెప్పారు. సమయానికి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు రాకపోతే ప్రాణాలతో ఉండేవాడిని కాదన్నారు. తమ ప్రాణాలు కాపాడిన పోలీసులకు అగ్నిమాపక సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. రమేష్ ఆసుపత్రి వారు అసలు ఈ హోటల్​ను ఎందుకు కేటాయించారని ప్రశ్నించారు. అక్కడ చాలా ఇబ్బందులుపడ్డామని చెప్పారు. ప్రస్తుతం తమకు అవసరమైన చికిత్స అందించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details