ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Loans: ఏపీకి రూ.3,716 కోట్ల రుణానికి అనుమతి.. విద్యుత్తు సంస్కరణలకు కేంద్రం నజరానా - ఏపీకి అదనపు రుణానికి కేంద్రం అనుమతి

Loans: విద్యుత్తు సంస్కరణల అమలుతో డిస్కంల నష్టాలు తగ్గించి, విద్యుత్తురంగ ఆర్థిక సామర్థ్యాన్ని బలోపేతం చేసినందుకు.. కేంద్రప్రభుత్వం దేశంలోని 10 రాష్ట్రాలకు ప్రోత్సాహం ప్రకటించింది. ఇందులో రాష్ట్రానికి బహిరంగ మార్కెట్‌ నుంచి రూ.3,716 కోట్ల అదనపు రుణానికి అనుమతి లభించింది.

extra loans sanctioned to state by central government
ఏపీకి రూ.3,716 కోట్ల రుణానికి అనుమతి

By

Published : Apr 8, 2022, 8:59 AM IST

Loans: విద్యుత్తు సంస్కరణల అమలుతో డిస్కంల నష్టాలు తగ్గించి, విద్యుత్తురంగ ఆర్థిక సామర్థ్యాన్ని బలోపేతం చేసినందుకు.. కేంద్రప్రభుత్వం దేశంలోని 10 రాష్ట్రాలకు ప్రోత్సాహం ప్రకటించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.28,204 కోట్ల అదనపు రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు బహిరంగ మార్కెట్‌ నుంచి రూ.3,716 కోట్ల అదనపు రుణానికి అనుమతి లభించింది. తమిళనాడు (రూ.7,054 కోట్లు), ఉత్తర్‌ప్రదేశ్‌ (రూ.6,823 కోట్లు), రాజస్థాన్‌ (రూ.5,186 కోట్లు) తర్వాత అత్యధిక అదనపు రుణ సౌకర్యం ఆంధ్రప్రదేశ్‌కే దక్కింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఈ అదనపు రుణాన్ని ఆంధ్రప్రదేశ్‌ సహా పది రాష్ట్రాలూ వాడుకున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌కు 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.46,443 కోట్ల బహిరంగ రుణానికి అనుమతించగా, అందులో పెట్టుబడి వ్యయంతో ముడిపెట్టినది రూ.5,309 కోట్లు,.. విద్యుత్‌ సంస్కరణలు అమలు చేసినందుకు రూ.3,716 కోట్లు తీసుకోవచ్చని కేంద్రం తెలిపింది. మిగిలిన రూ.37,418 కోట్లు నేరుగా బహిరంగ మార్కెట్‌ రుణాలుగా తీసుకునే వెసులుబాటు కల్పించింది.

ABOUT THE AUTHOR

...view details