విజయవాడ ఇంద్రకీలాద్రిపై తరచుగా కొండచరియలు విరిగిపడుతున్న సంగతి తెలిసిందే. 2008లో నిపుణల బృందం పర్యటించి దేవస్థానానికి కొన్ని సూచనలు, సిఫార్సులు చేసింది. కానీ...సమస్య పూర్తిగా తొలిగిపోలేదు. నేడు మరోమారు భూభౌతిక నిపుణుల బృందం ఇంద్రకీలాద్రిని సందర్శించి.. కొండచరియల ప్రాంతాలను పరిశీలించారు.
రాష్ట్ర దేవాదాయశాఖ సాంకేతిక సలహాదారు కొండలరావు, ఐఐటీ చెన్నైకు చెందిన ప్రొఫెసర్ నరసింహారావు, ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మాధవ్, బెంగళూరులోని ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్స్‌కు చెందిన ప్రొఫెసర్ శివకుమార్, జీఎస్‌ఐకు చెందిన నిపుణులతో కూడిన బృందం కొండపై ఎక్కడెక్కడ ఎలాంటి సాంకేతికత వాడాలనే విషయాలపై ఆలయ ఇంజనీరింగ్ సిబ్బంది, పాలకమండలికి పలు సూచనలు చేసింది.