ఒడిశాలోని ఉత్తర కోస్తా, పశ్చిమ బంగాల్పై ఆవరించిన అల్పపీడన ప్రాంతం స్థిరంగా కొనసాగుతోంది. ఇది ఉత్తరంగా కదిలి బీహార్, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్ల పైకి వచ్చే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది. అల్పపీడన ప్రభావంతో.. కోస్తాంధ్ర, ఒడిశా, పశ్చిమ బంగాల్, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్ ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయని వివరించింది. వీటి ప్రభావంతో కోస్తాంధ్ర సహా వేర్వేరు ప్రాంతాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
Weather: అల్పపీడన ప్రభావం.. కోస్తాంధ్రలో నైరుతి రుతుపవనాల విస్తరణ - అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్రలో రుతుపవనాల విస్తరణ
ఒడిశాలోని ఉత్తర కోస్తా, పశ్చిమ బంగాల్పై ఆవరించిన అల్పపీడన ప్రాంతం స్థిరంగా కొనసాగుతోంది. అల్పపీడన ప్రభావంతో.. కోస్తాంధ్ర, ఒడిశా, పశ్చిమ బంగాల్, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్ ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయని భారత వాతావరణ శాఖ వివరించింది.
అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్రలో నైరుతీ రుతుపవనాల విస్తరణ
ప్రస్తుతం కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉన్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే 24 గంటల్లో ఉత్తర కోస్తాలోని.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖతో పాటు ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలిపింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, తిరువూరు ప్రాంతాల్లో గడచిన 24 గంటల్లో 6 సెంటిమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది.
ఇదీ చదవండి:ఆడుకుంటూ బోరుబావిలో పడిన చిన్నారి