ప్రాంతాలను బట్టి టిక్కెట్ ధరలు ఖరారు చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 35 వల్ల థియేటర్లు నడపలేని పరిస్థితి నెలకొందని ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడలో 13 జిల్లాల ఎగ్జిబిటర్ల సమావేశం జరిగింది. సమావేశంలో టిక్కెట్ ధరలు ప్రభుత్వమే నిర్ణయించే ఈ జీవోపై ఉన్న అభ్యంతరాలను అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నామని తెలుగు ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్ తెలిపారు. విద్యుత్ బిల్లులు, జీతాలు కూడా చెల్లించుకోలేని దుర్భరస్థితికి ఎగ్జిబిటర్లంతా వచ్చారని వాపోయారు. తమ సమస్యల పరిష్కారానికి సీఎంతో చర్చించేందుకు సమయం కోసం ఎదురుచూస్తున్నామని ఎన్వీ ప్రసాద్ తెలిపారు.
జీవో 35 వల్ల థియేటర్లు నడపలేని దుస్థితి...
విజయవాడ తెలుగు ఫిలిం ఛాoబర్ కార్యాలయంలో 13జిల్లాల ఎగ్జిబిటర్ల సమావేశం జరిగింది. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 35 వల్ల థియేటర్లు నడపలేని పరిస్థితి నెలకొందని తెలుగు ఫిలిం ఛాoబర్ మాజీ అధ్యక్షులు ఎన్వీ ప్రసాద్ అన్నారు.
విజయవాడ తెలుగు ఫిలిం ఛాoబర్ సమావేశం