రెండు దశాబ్దాలుగా పేరుకుపోయిన తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. విజయవాడలో మాజీ సైనికులు ధర్నా నిర్వహించారు. ఉద్యోగాలు, రేషన్ కార్డులు, సంక్షేమ సంఘాల సమావేశాలు ఏర్పాటు చేయటంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం జీవోలు ఇస్తుందే తప్ప వాటిని ఆచరణలో పెట్టడం లేదని ఆక్షేపించారు. మాజీ సైనికుల రిజర్వేషన్లను 2 నుంచి 10 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. మాజీ సైనికులకు ఇంటి స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేస్తూ.. విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఆందోళన చేపట్టారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.
PROTEST: 'జీవోలు ఇస్తున్నారే తప్ప.. ఆచరణలో పెట్టడం లేదు'
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మాజీ సైనికులు మహాధర్నా నిర్వహించారు. మాజీ సైనికులకు ఇంటి స్థలాన్ని ఇవ్వాలని కోరారు. రిజర్వేషన్లు 10 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు.
విజయవాడలో మాజీసైనికుల ఆందోళన