విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. ఎంపీ కేశినేని నానిపై అవాకులు చవాకులు మాట్లాడటంపై మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెల్లంప్లలికి తానే రాజకీయ భిక్ష పెట్టానని జలీల్ ఖాన్ అన్నారు. మంత్రి వెల్లంపల్లికి దమ్ముంటే తనతో బహిరంగ చర్చకు రావాలని.. మంత్రి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పశ్చిమ నియోజకవర్గంలో కార్పొరేటర్‌గా నిలబడి గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. వెల్లంపల్లి కార్పొరేటర్‌గా గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు.
ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత మాట్లాడుతూ... తాను మేయర్ అభ్యర్థిగా గెలవగానే మొదటి సంతకం విజయవాడ నగరంలో అపరిష్కృతంగా ఉన్న డ్రైనేజీ సమస్యపై సంతకం పెడతానని హామీ ఇచ్చారు.