ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తాడిగడప పేరు మార్పుపై మాజీ ఎమ్మెల్యే బోడె ఆగ్రహం - తాడిగడపను వైఎస్సార్ తాడిగడపగా మార్చడంపై మాజీ ఎమ్మెల్యే బోడె మండిపాటు

కృష్ణాజిల్లా పెనమలూరు మండలంలోని తాడిగడపకు వైఎస్సార్ పేరు పెట్టడంపై.. మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మండిపడ్డారు. సీఎం జగన్ మెప్పు కోసమే ఎమ్మెల్యే పార్థసారథి.. వైఎస్సార్ పేరు పెట్టించారని ఆరోపించారు.

mla bode about tadigadapa name changing
తాడిగడప పేరు మార్పుపై మాజీ ఎమ్మెల్యే బోడె ఆగ్రహం

By

Published : Jan 6, 2021, 7:28 PM IST

వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీకి ఆ పేరు పెట్టడం వెనుక ఎవరు ఉన్నారో చెప్పాలని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ డిమాండ్‌ చేశారు. ఎన్టీఆర్‌తోపాటు అనేక మంది మహనీయులు కృష్ణా జిల్లాలో జన్మించినా.. ఆ పేర్లు గుర్తు రాలేదా? అని ప్రశ్నించారు. ఏ హక్కుతో తాడిగడపకు వైఎస్సార్ పేరు పెట్టారని నిలదీశారు.

సీఎం జగన్ మెప్పు కోసమే అవినీతిపరుడైన పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి.. తాడిగడపకు వైఎస్సార్ పేరు పెట్టించారని బోడె ప్రసాద్ విమర్శించారు. ఆ పేరు మార్చే వరకు తెదేపా పోరాటం చేస్తుందని తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details