న్యాయవ్యవస్థల తీరుపై సభాపతి తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు ఆయన పదవికి ఎంత మాత్రం తగవని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. ఒకవైపు రాజ్యాంగానికి లోబడే పరిపాలన సాగాలని చెబుతూ.. మరోవైపు రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను తప్పుబట్టడం సరికాదన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు మానుకుని సభను హుందాగా నడిపించడంపై దృష్టి సారించాలని హితవు పలికారు.
'న్యాయ వ్యవస్థలపై సభాపతి వ్యాఖ్యలు సరికాదు' - వడ్డే శోభనాద్రీశ్వరరావు వార్తలు
న్యాయ వ్యవస్థల తీరుపై సభాపతి తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు సరికావని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు మానుకుని సభను హుందాగా నడిపించడంపై దృష్టి సారించాలని హితవు పలికారు.
వడ్డే శోభనాద్రీశ్వరరావు, మాజీ మంత్రి