రేషన్ దుకాణాల ఎదుట ప్రజల్ని ఈ సమయంలో నిలబెట్టి... లాక్డౌన్కు ప్రభుత్వమే తూట్లు పొడుస్తోందని మాజీమంత్రి సుజయ్ కృష్ణ రంగారావు విమర్శించారు. ప్రభుత్వ అనాలోచిత చర్యలు కరోనా వ్యాప్తికి కారణం అవుతున్నాయని ఆరోపించారు. బ్యాగులతో ఇంటింటికీ పంపిణీ చేస్తే... సంచులతో కరోనా వ్యాప్తి చెందుతుందని మంత్రులు చెప్పడం విడ్డూరంగా ఉందని అభిప్రాయపడ్డారు. రేషన్ దుకాణాల ఎదుట గుంపులుగా సంచరిస్తే కరోనా వ్యాప్తి చెందదని మంత్రులు చెప్పగలరా అని ప్రశ్నించారు. వాలంటీర్ వ్యవస్థతో రేషన్ సరకుల పంపిణీ ఎందుకు చేయలేకపోయారని సుజయ్ కృష్ణరంగారావు నిలదీశారు.
'వాలంటీర్లతో రేషన్ సరకులు ఎందుకు పంపిణీ చేయలేదు..?' - రేషన్ పంపిణీపై సుజయ్ కృష్ణ కామెంట్స్ న్యూస్
రాష్ట్రంలో ఒక్కసారిగా పెరిగిన కరోన బాధితుల సంఖ్య ఆందోళన కలిగిస్తోందని మాజీమంత్రి సుజయ్ కృష్ణ రంగారావు ఆందోళన వ్యక్తం చేశారు. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని సకాలంలో ప్రభుత్వం గుర్తించలేకపోయిందని విమర్శించారు.
ex minister sujay krishna on ration supplyex minister sujay krishna on ration supply