అచ్చెన్నాయుడుని అక్రమంగా అరెస్ట్ చేశారని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఒక ప్రజాప్రతినిథిని ఎలా అరెస్ట్ చేస్తారంటూ మండిపడ్డారు. ఎన్నికల్లో భారీ విజయం సాధించామని.. వైకాపా ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రవర్తించడం తగదని హితవు పలికారు.
ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు మంచివికావు. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు మానుకోవాలి. శాసనసభ సమావేశాలు జరిగే సమయానికి అచ్చెన్నాయుడును అరెస్ట్ చేశారు. వారి అవినీతి పాలనపై ప్రశ్నిస్తారనే భయంతోనే అరెస్ట్ చేసినట్లు అనిపిస్తోంది. -పితాని సత్యనారాయణ, మాజీ మంత్రి