ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Paritala Sunitha: చంద్రబాబు గంట కళ్లు మూసుకుంటే చాలు: సునీత - పరిటాల సునీత వార్తలు

ఇన్నాళ్లు తామంతా చాలా ఓపిగ్గా ఉన్నామని.. రాష్ట్రంలో జరుగుతున్న దాడులను చూస్తూ ఇక ఓపికతో ఉండలేమని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. గతంలో తాము పోలీస్ విభాగాన్ని వాడుకుని ఉంటే.. వైకాపా గుండాలు మిగిలి ఉండేవాళ్లు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా తిరిగి అధికారంలోకి వచ్చాక.. చంద్రబాబు గంట పాటు కళ్లు మూసుకుంటే చాలని అన్నారు.

paritala sunitha
చంద్రబాబు గంట కళ్లు మూసుకుంటే చాలు: సునీత

By

Published : Oct 22, 2021, 1:20 PM IST

గతంలో తాము పోలీస్ విభాగాన్ని వాడుకుని ఉంటే.. వైకాపా గుండాలు మిగిలి ఉండేవాళ్లు కాదని మాజీ మంత్రి పరిటాల సునీత(ex minister paritala sunitha) ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిటాల రవిని పొట్టన పెట్టుకున్నా.. అధికారంలోకి వచ్చాక శాంతంగా ఉండమని తెదేపా అధినేత చంద్రబాబు చెప్పారని అన్నారు. ఆనాడే చంద్రబాబు కన్నెర్ర చేసి ఉంటే.. ఒక్కరు కూడా మిగిలి ఉండే వారు కాదని మండిపడ్డారు. పరిటాల రవిని చంపిన వాళ్లు రోడ్ల మీద తిరుగుతున్నా.. చంద్రబాబు మీద గౌరవంతో గొడవలు పెట్టుకోలేదన్నారు.

చంద్రబాబు గంట కళ్లు మూసుకుంటే చాలు: సునీత

మా పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు గంట కళ్లు మూసుకుంటే చాలు. తిట్లు మాకు వచ్చు. మేము మాట్లాడగలం. మాకు బీపీ వస్తే ఏం చేస్తామో త్వరలో చూపిస్తాం.ఇన్నాళ్లూ ఓపిగ్గా ఉన్నాం. ఇంకా ఓపికతో ఉండలేం.

-పరిటాల సునీత, మాజీ మంత్రి

ఇప్పటికైనా సరే.. చంద్రబాబు మీ పని మీరు చేయండని చెబితే.. మంత్రులను తిరగనివ్వబోమని సునీత హెచ్చరించారు. మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు కాళ్ల కింద ఉండే వ్యక్తులు.. వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఇన్నాళ్లూ ఓపిగ్గా ఉన్నామని, ఇంకా ఓపికతో ఉండలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.

ఇదీ చదవండి:

CBN: సరిదిద్దుకోలేని తప్పు చేశారు.. సీఎం, డీజీపీలపై బాబు ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details