ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సీబీఐ కేసుల్లో ఉన్నవారికి వాక్సిన్ తయారీ ఇవ్వండి' - ks jawahar tdp leader on vaccine

వ్యాక్సిన్ తయారీ సంస్థలను ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై.. ట్విట్టర్​లో మాజీ మంత్రి జవహర్ తీవ్ర స్థాయిలో వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. సీబీఐ కేసుల్లో ఉన్న ఫార్మా కంపెనీల వాళ్ళకు ఇస్తే, వాళ్లే వాక్సిన్లు ఎన్నంటే అన్ని తయారు చేసిస్తారేమో అని ఆయన విమర్శించారు.

మాజీ మంత్రి జవహర్
మాజీ మంత్రి జవహర్

By

Published : May 13, 2021, 10:46 PM IST

వ్యాక్సిన్ తయారీ సంస్థలను ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్​లో మాజీ మంత్రి జవహర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గంగవరం, కృష్ణ పట్నం పోర్టు ఓనర్లను లొంగదీసుకున్నట్లు.. జువారి సిమెంట్, అమర్ రాజా సంస్థలకు నోటీసులిచ్చిన తరహాలోనే వ్యాక్సిన్ తయారీ సంస్థల్ని లొంగతీసుకోవటం సాధ్యం కాదు అంటూ ఎద్దేవా చేశారు.

హైదరాబాద్​లో వ్యాక్సిన్ తయారు చేస్తుంటే తాడేపల్లిలో వాసన వస్తోందని కేసు పెట్టలేకపోతున్నారా అని విమర్శలు గుప్పించారు. లేదంటే సంగం డైరీలో సర్వర్లు లాక్కొచ్చినట్లు వ్యాక్సిన్ సంస్థ సర్వర్లు పట్టుకొచ్చే వారా అని ప్రశ్నించారు. సీబీఐ కేసుల్లో ఉన్న ఫార్మా కంపెనీల వాళ్ళకు ఇస్తే, వాళ్లే వాక్సిన్లు ఎన్నంటే అన్ని తయారు చేసిస్తారేమో అంటూ ఆయన దుయ్యబట్టారు.

ABOUT THE AUTHOR

...view details