ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజధానిగా అమరావతి కొనసాగాలని దుర్గమ్మను వేడుకున్నా: కొల్లు రవీంద్ర - విజయవాడ కనకదుర్గను దర్శించుకున్న కొల్లు రవీంద్ర

అమరావతిని కొనసాగించేలా చూడమని కనకదుర్గమ్మను వేడుకున్నట్లు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. కొండచరియలు విరిగిపడిన ఘటనకు పాలకులు, దుర్గ గుడి అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు.

kollu ravindra
కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి

By

Published : Oct 22, 2020, 2:28 PM IST

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొండ చరియలు విరిగిపడి ముగ్గురు గాయపడిన ఘటనకు.. పాలకులు, దుర్గగుడి అధికారుల నిర్లక్ష్యమే కారణమని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరోపించారు. దుర్గగుడిలో సరైన సదుపాయాలు కల్పించడం లేదని భక్తులు చెబుతున్నారని అన్నారు. భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గమ్మ వారిని కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించేలా పాలకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఐదేళ్ల క్రితం ఇదే రోజున రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేశారని... ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాజధానిపై అయోమయం నెలకొందన్నారు. అమరావతి కోసం భూములిచ్చిన రైతులు తీవ్రంగా నష్టపోయారన్న కొల్లు రవీంద్ర... రాజధానిని ఇక్కడే కొనసాగించేలా ఆశీర్వదించాలని దుర్గా మాతను వేడుకున్నట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details