ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఫిర్యాదు చేసిన వారిని బెదిరిస్తే ప్రతిష్ట పెరగదు: మాజీ మంత్రి జవహర్ - పోలీసులపై మాజీ మంత్రి జవహర్ వ్యాఖ్యలు

దేవాలయాల దాడులు వెనుక ఉన్న అసలు దోషుల్ని బోనులో నిలబెడితే గౌరవం పెరుగుతుందని మాజీ మంత్రి జవహర్ హితవు పలికారు. పోలీస్ వ్యవస్థ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. ఇకనైనా పోలీసులు వైకాపా ఒత్తిళ్లకు లొంగకుండా చట్టానికి పెద్దపీఠ వేస్తే బాగుంటుందని సూచించారు.

Ex Minister Jawahar
మాజీ మంత్రి జవహర్

By

Published : Jan 13, 2021, 6:22 PM IST

పోలీస్ వ్యవస్థ జగన్​రెడ్డి పార్టీ నేతల ఒత్తిడులకు తలవంచడంతో వారి ప్రతిష్టకు భంగం వాటిల్లుతోందని మాజీ మంత్రి జవాహర్ దుయ్యబట్టారు. ఇకనైనా వైకాపా ఒత్తిళ్లకు లొంగకుండా చట్టానికి పెద్దపీఠ వేస్తే.. వారి గౌరవం పెరుగుతుందన్నారు. ఫిర్యాదులు చేసే భక్తుల్ని, పౌరుల్ని, పత్రికల్ని, ప్రతిపక్షాల్ని బెదిరిస్తే ప్రతిష్ట పెరగదని హితవు పలికారు. హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులపై పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవటం.., వైఎస్ వివేకానంద రెడ్డి హత్యలో నేరస్థుల్ని అరెస్టు చేస్తే పోలీసుల ప్రతిష్ట పెరుగుతుందన్నారు. దేవాలయాల దాడులు వెనుక ఉన్న అసలు దోషుల్ని బోనులో నిలబెడితే గౌరవం పెరుగుతుందని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details