ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Jawahar Fire On Jagan:'విద్యా వ్యవస్థను సీఎం జగన్ నిర్వీర్యం చేస్తున్నారు' - మాజీ మంత్రి జవహర్ తాజా వార్తలు

ముఖ్యమంత్రి జగన్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారంటూ మాజీ మంత్రి జవహర్(Jawahar) బహిరంగ లేఖ విడుదల చేశారు. విదేశీ విద్యను నిలిపివేసి వెనుకబడిన విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేశారని ఆయన మండిపడ్డారు.

ex minister javahar open letter on education system
విద్యా వ్యవస్థను సీఎం జగన్ నిర్వీర్యం చేస్తున్నారు

By

Published : Jun 18, 2021, 3:43 PM IST

ప్రాథమిక పాఠశాలలను ఫౌండేషన్ పాఠశాలలుగా మారిస్తే 34 వేల స్కూళ్లు మూతబడి 15 వేల పోస్టులకు గండిపడుతుందని మాజీ మంత్రి జవహర్(Jawahar) ప్రభుత్వంపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారంటూ ఆయన ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. విద్యా వ్యవస్థపై రెండేళ్లుగా ప్రభుత్వం శ్రద్ధ చూపనందుకే నీతి ఆయోగ్ ర్యాంకుల్లో 3 నుంచి 19వ స్థానానికి దిగజారిపోయిందని విమర్శించారు.

జవహర్ బహిరంగ లేఖ

ఇప్పటికే పీజీ విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను రద్దు చేశారని లేఖలో పేర్కొన్నారు. విదేశీ విద్యను నిలిపివేసి వెనుకబడిన విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేశారని జవహర్ మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details