ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Bandaru sathyanarayana : 'విశాఖ రామానాయుడు స్టూడియోను దోచుకునేందుకు కుట్ర'

ముఖ్యమంత్రి వైఎస్ జగన్​మోహన్​రెడ్డి (CM jagan) పై మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి (Bandaru sathyanarayana) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రామానాయుడు స్టూడియో (Ramanaidu studio)పై జగన్ కన్నేశారని.. వారి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. రాజధాని పేరుతో విశాఖలో 600 ఎకరాల భూమిని దోచుకున్నారని సత్యనారాయణ మూర్తి మండిపడ్డారు.

మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి
మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి

By

Published : Jul 3, 2021, 8:39 PM IST

"విశాఖ రామానాయుడు స్టూడియో(Rama naidu studio)పై కన్నేసిన జగన్ రెడ్డి... ఆ కుటుంబసభ్యులను బెదిరిస్తున్నారు" అని మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి (Bandaru sathyanarayana) ఆరోపించారు. ఇందుకు విజయసాయిరెడ్డి మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారని మరో ఆరోపణ చేశారు. రామానాయుడు స్టూడియోను కబ్జా చేసేందుకు అనుకూలంగా లేడన్న కారణంతోనే అదనపు కమిషనర్​ను బదిలీ చేశారని వ్యాఖ్యానించారు.

2002లో చంద్రబాబు హయాంలో రామానాయుడు స్టూడియో నిర్మాణం కోసం 34.44 ఎకరాలను కేటాయించగా 2008లో స్టూడియో నిర్మాణం పూర్తయిందని బండారు సత్యనారాయణ మూర్తి తెలిపారు. రాష్ట్రంలో వైకాపా అధికారంలోని వచ్చాక విశాఖను నాశనం చేస్తున్నారని... ఇప్పటికే పలు భూములను కబ్జా చేశారని దుయ్యబట్టారు. రాజధాని పేరుతో జిల్లాలో 600 ఎకరాల భూమిని దోచుకున్నారని మండిపడ్డారు. అరబిందో భూముల ధరలు పెంచేందుకే విశాఖ బీచ్​ను అభివృద్ధి చేస్తున్నారని బండారు సత్యనారాయణ మూర్తి స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details