ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అర్ధరాత్రి జీవోలు, అక్రమ అరెస్టులు సీఎంకు అలవాటే' - బండారు సత్యనారాయణ వార్తలు

అర్ధరాత్రి జీవోలు ఇవ్వడం, అక్రమ అరెస్టులు చేయించడం ముఖ్యమంత్రి జగన్​కు అలవాటేనని.. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ విమర్శించారు. గీతం వర్శిటీపై వస్తున్న ఆరోపణల్లో నిజం ఉంటే నోటీసులు ఇచ్చి తదుపరి చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకానీ అర్ధరాత్రి కట్టడాలు కూల్చడం ఏమిటని ప్రశ్నించారు.

bandaru satyanarayana
బండారు సత్యనారాయణ, మాజీ మంత్రి

By

Published : Oct 24, 2020, 2:55 PM IST

అధికారం చేపట్టిన నాటి నుంచి కూల్చివేతలు, కబ్జాలకు కేరాఫ్ అడ్రస్​గా వైకాపా పాలన మారిందని మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి విమర్శించారు. గీతం వర్శిటీపై ఆరోపణల్లో నిజముంటే నోటీసులు ఇచ్చి తర్వాత చర్యలు తీసుకోవాలని సూచించారు.

అర్ధరాత్రి జీవోలు, అక్రమ అరెస్టులు సీఎం జగన్​కు అలవాటుగా మారిందని మండిపడ్డారు. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఈ వికృత చేష్టలని దుయ్యబట్టారు. జగన్ చేస్తున్న విధ్వంసాన్ని ప్రజలు గుర్తించారన్న బండారు.. త్వరలోనే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details