పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ సలహాదారుగా విశ్రాంత ఐఏఎస్ అధికారి, తమిళనాడు మాజీ ముఖ్యకార్యదర్శి పి. రామ్మోహన్ రావును నియమించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆయన అపార అనుభవం పార్టీకి దిశానిర్దేశం చేయడానికి ఉపయోగపడుతుందని జనసేనాని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ రాజకీయ వ్యవహారాల్లో ,ఎన్నికల నిర్వహణలో ఈ మాజీ సీఎస్ ఆలోచనలు ఉపయోగపడతాయన్నారు.