ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Ex CM Rosaiah funeral: రోశయ్య భౌతికకాయానికి సీఎం కేసీఆర్ నివాళి - రేపు ప్రభుత్వ లాంఛనాలతో రోశయ్య అంత్యక్రియలు

Ex CM Rosaiah funerals: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య భౌతికకాయానికి తెలంగాణ సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. హైదరాబాద్​లోని.. అమీర్‌పేట్‌లో రోశయ్య నివాసానికి చేరుకున్న సీఎం.. రోశయ్య భౌతికకాయానికి నివాళులర్పించారు.

kcr
kcr

By

Published : Dec 4, 2021, 1:16 PM IST

Updated : Dec 4, 2021, 2:06 PM IST

రోశయ్య భౌతికకాయానికి సీఎం కేసీఆర్ నివాళి

Ex CM Rosaiah funeral:ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​మాజీ ముఖ్యమంత్రి రోశయ్య భౌతికకాయానికి తెలంగాణ సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. మంత్రులతో కలిసి హైదరాబాద్​ అమీర్‌పేట్‌లోని రోశయ్య నివాసానికి చేరుకున్న సీఎం...రోశయ్య భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులను ఓదార్చిన కేసీఆర్.. వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

రోశయ్య మృతిపట్ల సంతాపం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది. మూడ్రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది.

రేపు అంత్యక్రియలు

రేపు కొంపల్లిలోని ఫామ్‌హౌస్‌లో మధ్యాహ్నం ఒంటిగంటకు రోశయ్య అంత్యక్రియలు జరగనున్నాయి. ఆదివారం ఉదయం వరకు రోశయ్య నివాసంలోనే ఆయన భౌతికకాయం ఉంచనున్నారు. అనంతరం ప్రజల సందర్శనార్థం.. గాంధీభవన్‌కు తరలిస్తారు. మధ్యాహ్నం 12 నుంచి 12.30 గంటల వరకు గాంధీభవన్‌లో రోశయ్య భౌతికకాయం ఉంచుతారు. ఆ తర్వాత గాంధీభవన్ నుంచి కొంపల్లి వరకు అంతిమయాత్ర కొనసాగనుంది. రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో రోశయ్య అంత్యక్రియలు జరగనున్నాయి.

Konijeti Rosaiah passed away:రాజకీయ కురువృద్ధుడు కొణిజేటి రోశయ్యకు(88) ఇవాళ ఉదయం పల్స్‌ పడిపోవడంతో కుటుంబసభ్యులు ఆయనను హైదరాబాద్​లోని స్టార్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందారు.

ఇదీ చదవండి:

rosaiah passes away: మాజీ సీఎం రోశయ్య కన్నుమూత.. రేపు అంత్యక్రియలు

Last Updated : Dec 4, 2021, 2:06 PM IST

ABOUT THE AUTHOR

...view details