పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం (ఇస్కఫ్) జాతీయ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కే.సుబ్బరాజు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలో పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అంటూ అవగాహన కార్యక్రమం చేపట్టారు. కరోనాతో పోరాడుతూనే మరోపక్క పర్యావరణాన్ని పరిరక్షించుకోవలన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యంతో అనేక ఉపద్రవాలు సంభవిస్తున్నాయని... పర్యావరణ సమతౌల్యత పాటించకపోవడం వల్ల మనుషుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటి దాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిది - former mla subbaraju speaks about environment
పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మాజీ ఎమ్మెల్యే కే.సుబ్బరాజు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలో పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అంటూ చేపట్టిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిది