Mayor Bhagyalakshmi: విజయవాడ ప్రథమ పౌరురాలిగా తన దృష్టికి వచ్చిన టికెట్ల సమస్య పరిష్కారం కోసమే... వందటికెట్లు కావాలని థియేటర్ యాజమాన్యాలకు లేఖ రాశానని మేయర్ భాగ్యలక్ష్మి తెలిపారు. వైకాపా కార్పొరేటర్లు సినిమా టికెట్లు అడిగారని... టికెట్ల కోసం థియేటర్ యాజమాన్యాలపై ఒత్తిడేమీ లేదని ఆమె తెలిపారు. యాజమాన్యాలకు ఎన్ని వీలుంటే అన్ని టికెట్లే ఇస్తారని చెప్పారు.
టికెట్ల కోసం థియేటర్ యాజమాన్యాలే లేఖ అడిగారు: విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి - విజయవాడ మేయర్ ముఖాముఖి
Mayor Bhagyalakshmi: టికెట్ల కోసం థియేటర్ యాజమాన్యాలే లేఖ అడిగారని విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి అన్నారు. టికెట్ల కోసం థియేటర్ యాజమాన్యాలపై ఒత్తిడేమీ లేదని చెప్పారు. యాజమాన్యాలకు ఎన్ని వీలుంటే అన్ని టికెట్లే ఇస్తారన్నారు.
![టికెట్ల కోసం థియేటర్ యాజమాన్యాలే లేఖ అడిగారు: విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి Vijayawada Mayor Bhagyalakshmi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14737614-42-14737614-1647334655742.jpg)
విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి
Mayor Bhagyalakshmi: మరోవైపు ఏడాది కాలంలో రూ.500 నుంచి రూ.600 కోట్ల పనులు చేశామని విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి వెల్లడించారు. నగరంలో రహదారుల అభివృద్ధి చేశామని మేయర్ అన్నారు. బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తైన సందర్భంగా విజయవాడ మేయర్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖిలో మాట్లాడారు.
విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి