తెలంగాణలో హైదరాబాద్ జీడిమెట్లలోని ఫాక్స్ సాగర్ చెరువు నిండడం వల్ల పక్కనే ఉన్న ఉమామహేశ్వర కాలనీ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. మొదటి అంతస్తు వరకు నీటిలో మునగడం వల్ల ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారు బయట ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఉమామహేశ్వర కాలనీవాసులను ఒడ్డుకు చేర్చిన 'ఈటీవీ భారత్' బృందం - etv bharat
కుంభవృష్టితో భాగ్యనగరంలోని పలు కాలనీలు వరదనీటిలో మునిగిపోయాయి. జలదిగ్బంధంలో చిక్కుకున్న ఉమామహేశ్వర కాలనీవాసులను ఈటీవీ భారత్ బృందం బోటు సాయంతో ఒడ్డుకు చేర్చింది. ఎంతో శ్రమకోర్చి వారిని కాపాడిన ఈటీవీ భారత్ బృందానికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.
ఉమామహేశ్వర కాలనీవాసులను ఒడ్డుకు చేర్చిన 'ఈటీవీ భారత్' బృందం
ఇంట్లో ఉన్న ముఖ్యమైన సామాన్లను తీసుకెళ్లడానికి వచ్చిన మహిళలు, వృద్ధులు వరద ప్రభావంతో తిరిగి వెళ్లలేక ఇండ్లపై చిక్కుకున్నారు. గమనించిన ఈటీవీ భారత్ బృందం మత్స్యకారుల సహాయంతో బోటులో వారిని ఒడ్డుకు చేర్చారు. వారు ఈటీవీ భారత్ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు
వరదెత్తిన కృష్ణమ్మ.. 2009 తర్వాత శ్రీశైలానికి మళ్లీ భారీ వరద
Last Updated : Oct 18, 2020, 8:00 PM IST