గతంలో తెలంగాణలో పౌరసరఫరాలశాఖ మంత్రిగా పనిచేసిన తనపై ఆ దిశగా కూడా కేసులు పెట్టొచ్చని మాజీ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. తాను ప్రేమతో లొంగదీసుకుంటే లొంగేవాడినని తెలిపారు. భయపెడితే లొంగిపోయే వాడిని కాదని చెప్పారు. ఎంత నష్టపోయినా లొంగిపోయే వాడిని కాదని స్పష్టం స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని అడగొచ్చు
పార్టీ పెడతానని... పార్టీ మారతానని ఎప్పుడూ చెప్పలేదని ఉద్ఘాటించారు. కారు గుర్తుపై గెలిచినందున రాజీనామా చేయమని అడగవచ్చని వ్యాఖ్యానించారు. తాను కూడా రాజీనామా చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈటల రాజేందర్ పదవుల కోసం పెదవులు మూయడని వెల్లడించారు. హుజూరాబాద్ కార్యకర్తలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటానని ప్రకటించారు.