ఈఎస్ఐ ఔషధాల కొనుగోలు అవతవకల కేసులో నిందితుడిగా ఉన్న ప్రమోద్ రెడ్డి విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో లొంగిపోయాడు. కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు ప్రమోద్ రెడ్డిని మచిలీపట్నం సబ్ జైలుకు తరలించారు. గతంలో హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రమోద్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు నిందితులను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
ఈఎస్ఐ మందుల కొనుగోలు కేసు.. కోర్టులో లొంగిపోయిన నిందితుడు - ఈఎస్ఐ కేసులో లొంగిపోయిన ప్రమోద్ రెడ్డి వార్తలు
ఈఎస్ఐ ఔషధాల కేసులో నిందితుడిగా ఉన్న ప్రమోద్ రెడ్డి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో లొంగిపోయాడు. గతంలో అతను ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఏసీబీ కోర్టు ప్రమోద్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది.
విజయవాడ ఏసీబీ కోర్టు